జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు భోగ, భాగ్యాలతో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని ఆమె ఆకాంక్షించారు. ఈ సంక్రాతి ప్రతి కుటుంబంలో నూతన కాంతులు నింపాలని, ప్రతి ఇంటా భోగభాగ్యాలను నింపాలని, ఇంటిల్లిపాది పండుగను ఎంతో ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని చెప్పారు.
