టీటీజెన్‌కో ఇంటర్ ప్రాజెక్ట్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో బీటీపీఎస్ మణుగూరు జట్టుకు విజేతల కప్

మణుగూరు, జూలై 3: టీటీజెన్‌కో ఆధ్వర్యంలో చల్పూర్‌లో నిర్వహించిన ఇంటర్ ప్రాజెక్ట్స్ క్రికెట్ టోర్నమెంట్‌లో బీటీపీఎస్–మణుగూరు జట్టు అద్భుత ప్రతిభ కనబరిచి విజేతల కప్‌ను కైవసం చేసుకుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనగా, బీటీపీఎస్ జట్టు అత్యుత్తమ ఆటతీరుతో విజేతగా నిలిచింది.

ఈ సందర్భంగా విజేతలైన జట్టు సభ్యులను బీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ బి. బిచ్చన్న అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీటీజెన్‌కో సంస్థ ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తోందన్నారు. క్రీడల ద్వారా ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటంతో పాటు విధుల్లో మరింత సమర్థవంతంగా పనిచేయగలరని తెలిపారు.

ఉద్యోగులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనూ ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. కార్మికుల కోసం బీటీపీఎస్‌లో నూతన క్రీడా మైదానం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఉద్యోగులు భద్రతా నిబంధనలు పాటిస్తూ అంకితభావంతో విధులు నిర్వహించి సంస్థ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ (అడ్మిన్) మురళీకృష్ణ, డీఈ (టెక్నికల్) సత్యనారాయణమూర్తి, బీటీపీఎస్ క్రీడా కార్యదర్శి కల్తీ నరసింహారావు, జట్టు కెప్టెన్ గోపి, హేమమూర్తి, అశోక్ రెడ్డి, నవీన్, రవి, సంపత్, తిరుపతి, అనిల్, ప్రవీణ్, విశృత్, దుర్గాప్రసాద్, రఫీ, భరత్, రాము, శివ, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *