మణుగూరు లోని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కేంద్రాన్ని సందర్శించిన తహసీల్దార్ మరియు MPDO
మణుగూరులోని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కేంద్రాన్ని తహసీల్దార్ రాఘవరెడ్డి మరియు MPDO కలిసి సందర్శించారు. ఈ సందర్శనలో మొత్తం 21 రకాలలో 07 రకాల ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉన్నట్లు గుర్తించారు.
ఈ సందర్బంగా, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రై ఫ్రూట్స్, గింజలు, డ్రై సీడ్స్‌తో కూడిన పౌష్టికాహారంను వారికి అందించారు.
అంతేకాకుండా, ఈ కేంద్రంలోని ప్రత్యేక ఉపాధ్యాయిని IERP మేడమ్ పిల్లల కోసం చేస్తున్న అద్భుత సేవలను తహసీల్దార్ మరియు MPDO ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ కార్యక్రమం ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల జిల్లా అధికారుల చిత్తశుద్ధిని చాటిచెప్పింది.
