అనాధ పిల్లలకు బిటిపిఎస్ హెల్పింగ్ హాండ్స్ సేవా కార్యక్రమం

మణుగూరు మండలం సి.టైప్ వద్ద ఉన్న బాల వెలుగు ఆశ్రమంలోని అనాధ పిల్లలకు చలికాలం దృష్ట్యా బిటిపిఎస్ హెల్పింగ్ హాండ్స్ సహకారంతో స్వేట్టర్లు, దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సి.ఈ. బిచ్చన్న చేతుల మీదుగా స్వేట్టర్లు, దుప్పట్లు అందజేశారు. అనంతరం పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి వారికి స్వయంగా వడ్డన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు ఆత్మస్థైర్యంతో ఉండాలని, దృఢ సంకల్పంతో చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉద్భోదించారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని, క్రీడల్లో తమ ప్రతిభను చాటుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిటిపిఎస్ హెల్పింగ్ హాండ్స్ సభ్యులు, బాల వెలుగు నిర్వాహకులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *