ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ క్రికెట్ మ్యాచ్‌ – మణుగూరు ఎలెవన్ ఘనవిజయం

దమ్మపేటలో నిర్వహించిన ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ క్రికెట్ మ్యాచ్‌లో  మణుగూరు ఎలెవన్ జట్టు అద్భుత విజయం సాధించింది.

👉 టాస్ గెలిచిన మణుగూరు జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
👉 బౌలర్ల ఆగ్రహ దాడికి ప్రత్యర్థి  పాల్వంచ బి జట్టు  8 ఓవర్లలో కేవలం  44 పరుగులకే కట్టడి  అయింది.
👉 ఆరంభం నుంచే వికెట్లు వరుసగా తీసి ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేసిన మణుగూరు బౌలర్లు రాణించారు.

తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన  మణుగూరు జట్టు  కేవలం  5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించి ఘనవిజయం  సాధించింది.

🏆  మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ – కృష్ణారావు  అద్భుత ఆటతీరుతో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు.

🎉 మణుగూరు ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ క్రికెట్ టీంకి హృదయపూర్వక అభినందనలు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *