మణుగూరు: చెవిటి మూగ విద్యార్థులకు రైస్, స్వీట్స్ పంపిణీ చేసిన నర్సిరెడ్డి
మణుగూరు: సింగరేణి మణుగూరు ఏరియాలో విశ్రాంత అదనపు జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్) శ్రీ నర్సిరెడ్డి గారు తన కుమారుని పెళ్లి రోజు మరియు మనవడి పుట్టినరోజు సందర్భంగా ఓ విశేష కార్యక్రమం చేపట్టారు. స్థానిక సీ టైపు వద్ద గల చెవిటి మూగ అంగవైకల్యం గల విద్యా నిలయంలో రైస్ మరియు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా, పాఠశాల కరస్పాండెంట్, సిబ్బంది, మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని నర్సిరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. గత మూడు దశాబ్దాలుగా ఈ పాఠశాల క్రమశిక్షణతో మాటలు రాని మూగ పిల్లలకు అంగవైకల్యం ఉన్న విద్యార్థులకు అనేక రకాలుగా విద్యా బోధనలు అందించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. పాఠశాల సిబ్బంది మరియు ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యాబుద్ధులను తీర్చిదిద్దడంలో అంకితభావంతో పని చేస్తుండటం స్ఫూర్తిదాయకమని అభినందించారు. తమ కుటుంబం గత 30 సంవత్సరాలుగా ఈ పాఠశాల సందర్శన చేయడం ఆనందాన్నిచ్చిందని, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం విద్యార్థుల మధ్య ఉత్సాహాన్ని నింపి, వారికి మానసిక ప్రోత్సాహాన్ని అందించింది. నర్సిరెడ్డి గారి వంటి వ్యక్తుల సహాయంతో ఈ విధమైన పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని కరస్పాండెంట్ పేర్కొన్నారు.
