మణుగూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కుర్రి నాగేశ్వరరావు

మణుగూరు: మణుగూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని హామీ ఇచ్చారు. ధాన్యం బస్తాల నిర్వహణలో గానీ, లోడింగ్ ప్రక్రియలో గానీ ఎలాంటి అంతరాయం లేకుండా, వేగంగా పని జరగేందుకు ప్రత్యేక కృషి చేస్తామని తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందించడం తమ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామన్నారు.ఈ పరిశీలన కార్యక్రమంలో సొసైటీ సీఈఓ జ్ఞాన దాస్ పాల్గొని, రైతులకు అందిస్తున్న సేవలను ర్యవేక్షించారు. “రైతుల ధాన్యం నాణ్యతకు అనుగుణంగా సక్రమ ధర పొందేలా చర్యలు తీసుకుంటాం” అని ఆయన హామీ ఇచ్చారు.  ఈ సందర్బంగా, రైతులు కొనుగోలు కేంద్రాల సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు  మరియు సిబ్బంది సమన్వయంతో క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం జరిగేలా చూస్తామన్న నిర్వాహకుల ప్రకటన రైతుల్లో నమ్మకాన్ని పెంచింది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *