కాటమయ్య రక్షణ కవచాల పంపిణీ.
జర్నలిస్ట్ చిర్ర : కాటమయ్య రక్షణ కవచాలను పంపిణీ చేసిన ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి మరియు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్,అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆది నారాయణ మరియు భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు తో కలిసి పంపిణీ చేశారు. శనివారం ఇల్లందు క్రాస్ రోడ్ లోగల సింగరేణి గెస్ట్ హౌస్ లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గౌడ్ అన్నలకు రక్షణ కవచాలను పంపిణి చేశారు.ఈ సందర్భంగా ఖమ్మం పార్లమెంటు రామ సహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ గీత కార్మికుల రక్షణకు ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచాల కిట్లు గౌడ్ అన్నలకు ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. గౌడ్ అన్నలు తమ వృత్తిలో భాగంగా తాటి చెట్లు ఎక్కుతున్న క్రమంలో ఆకస్మికంగా జరిగే ప్రమాదాల వలన చాలామంది మరణానికి, శాశ్వత అంగవైకల్యానికి గురి అవుతున్న క్రమంలో వాటిని అరికట్టడానికి ప్రభుత్వం గౌడ్ అన్నల భద్రత కోసం ప్రత్యేక దృష్టి సాధించి వారికోసం ప్రత్యేకంగా ఒక కిట్ తయారు చేయించి దానిని గౌడ్ అన్నల కులదైవం అయినటువంటి కాటమయ్య పేరు పెట్టి కాటమయ్య రక్షగా ఒక పథకం ద్వారా అందరికీ ఆ కిట్లను అందజేస్తుందన్నారు. దీనిలో భాగంగా గీత కార్మికులకు దశలవారుగా శిక్షణ ఇచ్చి, అందరికీ అందే విధంగా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూరక్షక కవచం కిట్ల వల్ల కల్లు గీత కార్మికులు చెట్లపైకి వెళ్లినప్పుడు ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని, వీటిని ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, దీనిని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కల్లుగీత కార్మిక సొసైటీ పరిధిలోని చెట్లపైకి ఎక్కే గీత కార్మికులందరినీ గుర్తించి వారికి రక్షక కవచ కిట్లను అందజేస్తామని తెలిపారు. కాటమయ్య రక్షక కవచం కిట్లను అందజేసిన గీత కార్మికులు వాటిని వినియోగిస్తున్నారా లేదా చూడాలని, ఈ కిట్ల వినియోగం వల్ల కలిగే లాభాలను ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో గీత కార్మికుల రక్షణ కోసం కాటమయ్య రక్షణ కవచాలు కంపెనీ కార్యక్రమం చేపట్టడంచాలా సంతోషం కరమని అన్నారు.జిల్లా లో ని రెండు పార్లమెంట్ నియోజకవర్గలా ఖమ్మం, భద్రాచలం పరిధిలో ఈరోజు 83 మందికి కాటమయ్య రక్షణ కవచాల పంపిణీ చేపడుతున్నామన్నారు. గీత కార్మికులకు రక్షణ కోసంకోసం ప్రభుత్వం 12,000 ఖర్చు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఇందిర, మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

