-
వరద బాధిత ఫోటోగ్రాఫర్స్ కి ఆర్ధిక సహయం అందచేత..
-
ఒక్కో కుటుంబానికి 5000…
మణుగూరు మండలం లో సెప్టెంబర్ నెలలో ప్రకృతి విపత్తు తో సంభవించిన వరదలతో మణుగూరు ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శాశ్వత సభ్యులు నలుగురు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. గతంలో రాష్ట్ర , జిల్లా , ఇతర జిల్లా ల సహకారం తో ఒక్కొక్క కుటుంబానికి 33500 రూపాయలు ఆర్ధిక సహాయం చేయటం జరిగింది.. ఈ రోజు స్థానిక అసోసియేషన్ సభ్యుల సహకారంతో 15000 మరియు పినపాక, కరకగూడెం మండలాల అసోసియేషన్ ఆధ్వర్యంలో 5000 మొత్తం 20000 రూపాయల ను ఒక్కొక్కరికి 5000 చొప్పున పంచడం జరిగింది.. ఈ సందర్భంగా మణుగూరు మండల ఫోటో& వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన సభ్యులను ఆదుకున్న రాష్ట్ర, జిల్లా మరియు మండల కమిటీలకు కృతజ్ఞతలు తెలియచేసారు.. ఇలాంటి పరిస్థితుల్లో వారికి సంఘాలు అండగా నిలిచి సహకారం అందించటం సంతోషం గా ఉందని.. మానవత దృక్పథం తో స్పందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసారు.. అందరూ సమిష్టిగా పని చేసి సంఘ అభివృద్ధి కి పాటు పడాలని..చేయి, చేయి కలుపుదాం – సంఘాన్ని బలోపేతం చేద్దాం అనే నినాదంతో ముందుకుపోవాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుణగంటి సారయ్య, మణుగూరు అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ మోహన్ , కార్యదర్శి పుసులూరి శ్రీనివాస్ , పినపాక మండల కోశాధికారి వాగబోయిన సాంబ మరియు వరద బాధిత కుటుంబ సభ్యులు , మణుగూరు అసోసియేషన్ శాశ్వత సభ్యులు పాల్గొన్నారు..
