మణుగూరు గ్రామాల అభివృద్ధికి శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఐ డిమాండ్
(చిర్ర శ్రీనివాస్ గౌడ్ – మణుగూరు ఇండిపెండెంట్ జ్పుర్నలిస్ట్ )
మణుగూరు: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి సంబంధించి ప్రజా ప్రతినిధులు, అధికారులు శాశ్వత పరిష్కారాలు తీసుకోవాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మణుగూరు పట్టణంలో జరిగిన సిపిఐ సమావేశంలో మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మీ కుమారి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. లక్ష్మీనారాయణ, సిపిఐ పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధాకర్ మాట్లాడుతూ, గ్రామాల్లో అభివృద్ధి లోపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లోని వీధులు మరియు డ్రైన్ల సమస్యలను పరిష్కరించాలని, వర్షాకాలంలో నీరు ఇళ్లలోకి చేరే పరిస్థితులు అధిగమించేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. వీధి లైట్ల సమస్య, చెత్త పరిష్కారం, డ్రైన్ల శుభ్రత లాంటి అంశాల్లో అధికారులు శ్రద్ధ వహించడం లేదని సిపిఐ నాయకులు ఆరోపించారు. సిపిఐ శతజయంతి సందర్భంగా గ్రామాల్లో శుభ్రతా కార్యక్రమాలు నిర్వహించి, ప్రజల సమస్యలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. అనంతరం నూతన కమిటీని ఎన్నిక చేశారు.
కమిటీ సభ్యులు:
- శాఖ కార్యదర్శి: ఆధర్ల రాములు
- సహాయ కార్యదర్శి: ఎస్. డి. ఉమర్
- కోశాధికారి: గుండె యాకయ్య
- గౌరవ అధ్యక్షులు: వంగ రాములు
