భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ క్రీడాకారుల ఘనత – వాలీబాల్ టోర్నమెంట్లో ద్వితీయ స్థానం
తేదీ: 03-01-2025 ,ణుగూరు (BTPS) ,భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (BTPS) క్రీడాకారులు TG Genco ఇంటర్ ప్రాజెక్ట్ వాలీబాల్ టోర్నమెంట్ లో అద్భుత ప్రదర్శన కనబరచి ద్వితీయ స్థానం సాధించారు. ఈ టోర్నమెంట్ గత మూడు రోజులుగా హైదరాబాద్ విద్యుత్ సౌధాలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా, BTPS చీఫ్ ఇంజనీర్ శ్రీ B. బిచ్చన్న గారు క్రీడాకారులను అభినందించి, వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “TG Genco ఉత్పత్తిలో అగ్రగామిగా నిలవడానికి ప్రతి ఉద్యోగి క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి. సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలి. మా ఉద్యోగుల సంక్షేమం మా ప్రధాన లక్ష్యం. క్రీడాకారులను ప్రోత్సహించడం మా విధిగా భావిస్తున్నాం. వారు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కూడా పాల్గొని సంస్థకు మంచి పేరును తీసుకురావాలని ఆశిస్తున్నాను,” అనిఅన్నారు. ఈ సందర్భంగా, BTPS క్రీడా కార్యదర్శి కల్తీ నరసింహా రావు, జట్టు మేనేజర్ B. ఉదయ్ కిరణ్, మరియు ఇతర అధికారులు క్రీడాకారులను అభినందించారు. వారు చెప్పినట్లు, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి సంస్థ ప్రతిష్ఠను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో JJ నాయన, G. ఆనందప్రసాద్, SV. సత్యనారాయణ, P. తిరుపతయ్య, K. మధు, K. రంగారావు, Ch. ప్రశాంత్, S. నరసింహ, G. సతీష్, G. సంపత్, P. ప్రవీణ్ కుమార్, A. ప్రసాద్ కుమార్, T. గోపి, అశోక, B. సత్యనారాయణ, T. అనీల్, G. వెంకట్, భరత్, రాము, కోశాధికారి సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ సెక్రటరీ K. నరసింహారావు మాట్లాడుతూ, “ఈ విజయానికి కారణమైన క్రీడాకారులకు హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాము,” అని తెలిపారు.
