మణుగూరు పట్టణంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ

మణుగూరు: ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరంపై మణుగూరు పట్టణంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ మరియు ప్రదర్శన నిర్వహించారు.
ఈ ర్యాలీ ద్వారా ఓటు హక్కు వినియోగం ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడం, ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా పాల్గొనాలని కోరడం ముఖ్య ఉద్దేశంగా ఉంది. ర్యాలీకి విద్యార్థులు, రెవెన్యూ శాఖ అధికారులతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రజలలో ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు నినాదాలు చేశారు. ఓటు హక్కు వినియోగం ప్రజాస్వామిక విధానం పటిష్టానికి కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో డిటి ఎస్ కృష్ణ, ఆర్‌ఐ లీలావతి, ఆర్‌ఐ గోపి, గంట. వెంకటేశ్వర్లు, రామారావు ,ఏపీఎం అహ్మద్ హుళ్ళ, వెంకటి ,మున్సిపాలిటీ కమిషనర్ యాదగిరి,,ఏ.ఇ  సత్యనారాయణ, సరిత, కోటేశ్వరరావు, రత్నాకర్, మధు, నరేందర్, రవీందర్, సందీప్,,మెప్మా సిబ్బంది,డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, పాలిటెక్నిక్ కాలేజీ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నరూ   ఈ కార్యక్రమం ప్రజలలో ఓటు హక్కు పట్ల చైతన్యం కలిగించి, ఎన్నికలలో అధిక శాతం ఓటింగ్ సాధించడంలో సహాయపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *