కేఏ పాల్ పగిడేరు పాదయాత్ర, శాంతినగర్ లో బహిరంగ సభ
పగిడేరు: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ ఆధ్వర్యంలో ఈ నెల 19న గురువారం ఉదయం 11 గంటలకు పగిడేరు నుండి పాదయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం శాంతినగర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బహిరంగ సభను నిర్వహించనున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి ప్రతిపాదనలు అందించడం ముఖ్య ఉద్దేశం.శాంతినగర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగే బహిరంగ సభలో కేఏ పాల్ ప్రజలతో మాట్లాడతారు. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాకు ఆహ్వానం: ఈ కార్యక్రమానికి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజాశాంతి పార్టీ జిల్లా కో-ఆర్డినేటర్ కర్నే లక్ష్మణరావు కోరారు.
