మోహన్ బాబు దాడిలో గాయపడిన టీవీ9 జర్నలిస్టు రంజిత్‌ను పరామర్శించిన TWJF నేతలు
హైదరాబాద్: ప్రముఖ నటుడు మోహన్ బాబు దాడిలో గాయపడిన టీవీ9 జర్నలిస్టు రంజిత్‌ను యశోద ఆస్పత్రిలో పరామర్శించారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (TWJF) ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య, ఉపాధ్యక్షులు రాజశేఖర్, మరియు HUJ అధ్యక్షుడు బి. అరుణ్ కుమార్. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు దురదృష్టకరమని TWJF నేతలు పేర్కొన్నారు. గాయపడిన రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనకు కావాల్సిన అన్ని రకాల సహాయం అందించేందుకు TWJF సంఘం కట్టుబడి ఉందని చెప్పారు. జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించాలనీ, జర్నలిస్టులపై దాడులను తీవ్రంగా ఖండించాలని TWJF నేతలు డిమాండ్ చేశారు. TWJF పత్రికా స్వేచ్ఛకు పట్టుదలతో పని చేస్తుందని, జర్నలిస్టుల హక్కుల కోసం ఎల్లప్పుడూ పోరాడుతుందని వారు తెలియజేశారు.
