“వినోదం విషాదంగా మారకూడదు: భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి”

సినిమా అనేది వినోదానికి మాత్రమే పరిమితం కావాలి, కానీ బుదవారం  రోజు  సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటనలో ఒక కుటుంబం తీరని విషాదంలో కూరుకుపోయింది. అల్లు అర్జున్ అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కొడుకు పరిస్థితి ఇప్పుడు ఆసుపత్రిలో విషమంగా ఉంది.  అల్లు అర్జున్ సందర్శనకు ముందుగా గల సమాచారం వల్ల అభిమానులు థియేటర్ వద్ద భారీగా చేరుకున్నారు. పోలీసు భద్రత తగిన విధంగా ఉండకపోవడం, అనుకున్నదాని కంటే ఎక్కువ సంఖ్యలో అభిమానులు రావడం ప్రధాన కారణమయ్యాయి. థియేటర్ యాజమాన్యం సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం. ఇరుకు ప్రదేశంలో ప్రజలను సమర్ధవంతంగా నిర్వహించడంలో వైఫల్యం.  పిల్లలు, కుటుంబ సభ్యులను ఇలా జనసందోహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు తీసుకెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హీరోలను ఆరాధించడంలో తప్పేమీ లేదు, కానీ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఓ సంతోషకరమైన సంఘటన ఇలా విషాదానికి దారితీయకూడదు. హీరోలు ప్రజల ముందు ప్రదర్శన ఇచ్చేటప్పుడు  క్రమబద్ధమైన ఏర్పాట్లు చేయాలి. థియేటర్లు జనసందోహాన్ని నియంత్రించే ప్లాన్ కలిగి ఉండాలి. భారీ రష్ ఉండే ప్రదేశాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉండాలి. ఇలాంటి సంఘటనల పునరావృతం కాకుండ ఉండేందుకు  స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి. అల్లు అర్జున్ స్పందించాలి  సంతాపం తెలిపి, బాధిత కుటుంబానికి అండగా నిలవాలి.  ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలి.

ప్రజలకు విజ్ఞప్తి: సినీ అభిమానులు ఇలాంటి సందర్భాల్లో సహనం పాటించాలని, వ్యక్తిగత భద్రతను దృష్టిలో ఉంచుకోవాలి ఈ ఘటన అందరికీ ఒక గుణపాఠం కావాలి. వినోదం మన జీవితాన్ని ఆనందంతో నింపాల్సినదే గాని, అనుకోని దుస్థితికి గురి చేయకూడదు. జీవితం విలువైనది, దాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *