తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణుల బోర్డుకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు సభ్యత్వం కల్పించే అవకాశం

తెలంగాణ రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణ, ఆవాస అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న వన్యప్రాణుల బోర్డు త్వరలో కొత్త సభ్యులను నియమించనుంది. ఈ నేపథ్యంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లును బోర్డు సభ్యుడిగా నియమించే అవకాశం ఉందని సమాచారం. పాయం వెంకటేశ్వర్లు వన్యప్రాంతాల పరిరక్షణ, అడవుల అభివృద్ధి, పర్యావరణ సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి, తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. రధం గుట్ట ఫారెస్ట్ అర్బన్ పార్కు అభివృద్ధిలో ఆయన కృషి ప్రశంసనీయమైంది. ఈ క్రమంలో ఆయనను వన్యప్రాణుల బోర్డుకు సభ్యుడిగా నియమించడం రాష్ట్రానికి శ్రేయస్కరం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వన్యప్రాణుల బోర్డులో సభ్యుడిగా వెంకటేశ్వర్లుకు నియమితులైతే, రాష్ట్రంలోని అడవుల సంరక్షణ, వన్యజీవుల కాపాడటం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పాలసీల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.పాయం వెంకటేశ్వర్లను బోర్డు సభ్యుడిగా నియమించే అవకాశంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ, ఇది పినపాక నియోజకవర్గానికి గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయబోతుండగా, పాయం వెంకటేశ్వర్లను సభ్యుడిగా ఎంపిక చేస్తే వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *