మణుగూరు సిటీ కేబుల్ వ్యవస్థాపకుడు శ్రీ సుధాకర్ గారి మృతి పట్ల సంతాపం

మణుగూరు బండారిగూడెం ప్రాంతంలోని సిటీ కేబుల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీ సుధాకర్ గారు ఈరోజు ఉదయం ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఈ వార్త మణుగూరు పట్టణ ప్రజలందరికీ తీవ్ర దిగ్బంధానికి గురిచేసింది.సుధాకర్ గారు కేవలం ఒక వ్యాపారవేత్తగానే కాకుండా, మణుగూరు ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక ఆప్యాయతభరితమైన వ్యక్తి. చిన్నా-పెద్దా అనే తేడా లేకుండా అందరితో మంచినడవడిక కలిగి ఉండే ఆయన మృతిని మణుగూరు ప్రజలు ఒక తీరని లోటుగా భావిస్తున్నారు.మణుగూరులో సిటీ కేబుల్ రంగానికి మార్గదర్శకుడిగా నిలిచిన సుధాకర్ గారు స్థానిక వార్తలను మణుగూరు పరిసర ప్రాంతాలు, అశ్వాపురం, పినపాక, బయ్యారం వంటి ప్రాంతాలకు అందించడంలో ప్రత్యేక పాత్ర పోషించారు. కేబుల్ నెట్‌వర్క్ ద్వారా వార్తల ప్రసారం చేసే విధానానికి నాంది పలికిన ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయి. ఈ వార్త విని పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, సుధాకర్ గారి ఆత్మకు శాంతి కలగాలని తమ సంతాపాన్ని తెలియజేశారు. శ్రీ సుధాకర్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *