హాస్టల్ విద్యార్థినులకు స్వెటర్ల పంపిణీ చేసిన కలెక్టర్

కొత్తగూడెం-చుంచుపల్లిలోని ఎస్సీ బాలికల ప్రీమెట్రిక్ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం సాయంత్రం సందర్శించారు. చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, విద్యార్థినిల ఆరోగ్యాన్ని కాపాడటానికి స్వెట్టర్లను పంపిణీ చేశారు.

కలెక్టర్ ఈ సందర్బంగా విద్యార్థినులతో భోజనం చేయడం ద్వారా వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. హాస్టల్ మెనూ ప్రకారం పోషక ఆహారం అందించాలని హాస్టల్ వార్డెన్‌ను ఆదేశించారు. విద్యార్థినులు ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ అధికారి అనసూయ, హాస్టల్ వార్డెన్, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థినులు కలెక్టర్ చొరవకు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.

కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పర్యటనతో హాస్టల్ విద్యార్థినులకు విశ్వాసం కలిగిందని హాస్టల్ సిబ్బంది పేర్కొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *