రాష్ట్రస్థాయి టాలెంట్ టెస్టుకు రామానుజవరం విద్యార్థుల ఎంపిక
మణుగూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామానుజవరం విద్యార్థులు చెకుముకి టాలెంట్ టెస్టులో ప్రతిభను చాటుకున్నారు. నిన్న కొత్తగూడెం సింగరేణి హైస్కూల్‌లో జరిగిన జిల్లాస్థాయి టెస్టులో ప్రధమ స్థానాన్ని పొందిన వీరు, ఆదిలాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి టెస్టుకు ఎంపికయ్యారు.
విజేతలు:
- బి. తేజస్వి (10వ తరగతి)
- సి.హెచ్. హేమశ్రీ (10వ తరగతి)
- బి. హర్షిణి (9వ తరగతి)
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయిని పి. యశోద, అభినందన సభలో విద్యార్థులను ఘనంగా సత్కరించారు. సభలో మండల విద్యాశాఖాధికారి జి. స్వర్ణ జ్యోతి మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత, ప్రోత్సాహం వలననే ఈ విజయ సాధ్యమైందని ప్రశంసించారు. అంతేకాక, రాష్ట్రస్థాయిలో కూడా ప్రతిభ కనబరచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రామానుజవరం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు యస్. రమేష్, ఇ. వనిత, ఐ. భుజంగరావు, వి.వి. కోటేశ్వరరావు, జి. సురేష్ మరియు సాంబాయిగూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీలత పాల్గొన్నారు.
విద్యార్థుల ఈ విజయం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది.
