కొత్తగూడెం బస్ డిపోలో నూతన లగ్జరీ బస్సు ప్రారంభం
ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులు
కొత్తగూడెం, 15 నవంబర్:
కొత్తగూడెం బస్ డిపోలో నూతన లగ్జరీ బస్సు ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, “పాత బస్సుల స్థానంలో హైదరాబాద్ మరియు సదుర ప్రాంతాలకు ప్రయాణించడానికి నూతన లగ్జరీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని” చెప్పారు. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచడం కోసం ప్రభుత్వం ఈ చర్యను తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్, అర్ యం ఓ, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు భాస్కరరావు, సిపిఐ కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య, భూక్య శ్రీనివాస్, యూసఫ్, విజయ్, కంచర్ల శ్రీనివాస్, సింగరేణి కాలర్స్ యూనియన్ నాయకులు వంగ వెంకట్, దుర్గరాసి ఎంకన్న, వాసిరెడ్డి మురళి, నాయకులు చంద్రగిరి శ్రీనివాస్, సలిగంటి శ్రీనివాస్, నేరెళ్ల రమేష్, రేగల రాంబాబు, ఫాహిమ్, ఉపేందర్, గుండు శీను, తదితరులు పాల్గొన్నారు.
