పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

చిర్ర శ్రీనివాస్ గౌడ్ – మణుగూరు ఇండిపెండెంట్ జ్పుర్నలిస్ట్

**భద్రాద్రి కొత్తగూడెం**: పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయాలన్నది తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ముఖ్య బాధ్యతగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. గురువారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జ్ఞాపకార్థంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో, కలెక్టర్ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లలంటే నెహ్రూ గారికి ఉన్న ప్రత్యేక ప్రేమ కారణంగా బాలల దినోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. బాలల భవిష్యత్తు సమాజానికి ఎంతో ప్రాముఖ్యమని, ప్రతి ఒక్కరికీ వారి కలలు సాకారం చేసుకునేందుకు పెద్దలుగా మద్దతు ఇవ్వాలని సూచించారు.

**నైపుణ్యాల ప్రాముఖ్యత**: పిల్లల్ని వేరే వారితో పోల్చకుండా, వారి స్వంత నైపుణ్యాలను గుర్తించి అభివృద్ధి చెందేందుకు తగిన అవకాశాలు కల్పించాలని కలెక్టర్ అన్నారు. ఈమధ్య ఐటీడీఏ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో ట్రైబల్ డిపార్ట్మెంట్ విజయం సాధించడాన్ని ప్రస్తావిస్తూ, మన జిల్లాలోని ప్రతిభావంతులైన పిల్లల కోసం మరిన్ని అవకాశాలు కల్పించాలని సూచించారు.

**విజయానికి సులభ మార్గాలు లేవు**: “పెద్ద కోచింగ్ సెంటర్లలో చదవడం అనేది విజయం సాధించే ఏకైక మార్గం కాదు. మా బాల్యంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకుని విజయాలు సాధించాను,” అంటూ తన బాల్యంలో జరిగిన బాలల దినోత్సవ వేడుకలను విద్యార్థులతో పంచుకున్నారు.

**పుస్తక పఠన ప్రాధాన్యం**: ప్రస్తుతం జరుగుతున్న గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా, నెహ్రూ గారి లేఖలు చదవడం ద్వారా పిల్లలకు దేశాభిమానాన్ని పెంపొందించేలా ప్రేరణ లభిస్తుందని పేర్కొన్నారు. “చందమామ, చంపక్ లాంటి పుస్తకాలు పిల్లలకు మానసిక పెంపొందనకు తోడ్పడేవి,” అని, గ్రంథాలయాలను ఉపయోగించుకుని మంచి జ్ఞానాన్ని పొందాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

**ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు**: కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా, ఐటీడీఏ మనోవికాస్ పాఠశాల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం, వివిధ రంగాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు కలెక్టర్ ప్రశంస పత్రాలు, పుస్తకాలు మరియు బహుమతులు అందజేశారు.

**సహాయ చర్యలు**: బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న కుసుమ కుమారికి, ఎన్ఆర్ఐ తోటకూర రమేష్ అందించిన రూ.1,00,000 ఆర్థిక సహాయం చెక్కును కలెక్టర్ అందజేశారు. అనంతరం “ది ఇన్నర్ వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్” పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి లెనినా, సిడబ్ల్యుసి చైర్మన్ భారత రాణి, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *