నర్సింగ్ కళాశాల కోసం వసతి సదుపాయాల ఏర్పాటుకు తగిన భవనం పరిశీలన

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని నర్సింగ్ విద్యార్థుల వసతి సదుపాయాల సమస్యను పరిష్కరించేందుకు, జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్, శ్రీ రామచంద్ర బాలికల పాఠశాల భవనాన్ని పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న నర్సింగ్ కళాశాల భవనం వసతి సదుపాయాలకు సరిపోకపోవడంతో, విద్యార్థులకు తగిన సదుపాయాలను కల్పించేందుకు అనువైన భవనాన్ని ఎంపిక చేయాలని కలెక్టర్ కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. ఈ సందర్బంగా, నర్సింగ్ విద్యార్థులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన కలెక్టర్, విద్యార్థులకు తల్లిదండ్రుల ఆశయాల మేరకు కష్టపడి చదివి, జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు మరియు ఇతర వసతులు అందించడానికి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) విద్యా చందన, జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *