పల్లెకు పాల్: పగిడేరు గ్రామంలో కే ఏ పాల్ పర్యటన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు:ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కే ఏ పాల్ “పల్లెకు పాల్” నినాదంతో మణుగూరు మండలంలోని పగిడేరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాశాంతి పార్టీకి రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తే 100 రోజుల్లో గ్రామాల అభివృద్ధిని చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 12 వేల గ్రామాలకు జరిగే సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కే ఏ పాల్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గతంలో అనేకమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “సర్పంచ్ అభివృద్ధి చేయకపోవడానికి కారణం ప్రభుత్వ పథకాల అమలు లోపాలు” అని పాల్ విమర్శించారు. కే ఏ పాల్, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికి మెసేజ్ పంపిన విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. “కేసీఆర్ బంగారు తెలంగాణ అని చెప్పి ఏడేళ్లలో ఏడు లక్షల కోట్ల అప్పు చేసినా అభివృద్ధి చేయలేకపోయారు. ఇప్పుడు ఈ అప్పు ఎనిమిది లక్షల కోట్లకు చేరుకుంది. తెలంగాణ ప్రజలకు అభివృద్ధి హక్కు ఇచ్చి, మీ గ్రామాలను అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను,” అని పాల్ అన్నారు. “సర్పంచులు, పంచాయతీ నాయకులు ఐక్యంగా పనిచేస్తే, గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాశాంతి పార్టీ పూర్తి సహకారం అందిస్తుంది. నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి జనవరి 28న పూర్తి కార్యాచరణ ప్రకటిస్తాను,” అని పాల్ అన్నారు. “ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రాగానే, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడం నా బాధ్యత. అందుకు సంబంధిత గ్రామాల ప్రజలు, నాయకులు పూర్తి స్థాయిలో కృషి చేయాలి,” అని కే ఏ పాల్ పిలుపునిచ్చారు. కే ఏ పాల్ తన ప్రసంగంలో ప్రజలతో మాట్లాడుతూ, “మీ గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి. గ్రామాభివృద్ధి సాధన నా ముఖ్య లక్ష్యం,” అని హామీ ఇచ్చారు. పల్లెకు పాల్ నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో కే ఏ పాల్ చేస్తున్న పర్యటన ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది. రాబోయే రోజుల్లో ఆయన కార్యక్రమాలు ఏ విధంగా ప్రభావం చూపుతాయో
