కనుల పండుగగా కమ్మ వారి వనభోజనాలు

 జర్నలిస్ట్ చిర్రా  వెబ్ డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.  మణుగూరు: కమ్మ మహాజన సంగం ఆధ్వర్యంలో నేడు మణుగూరు అర్బన్ పార్క్ జలపాతం ప్రాంగణంలో కమ్మ మహాజన వనభోజన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక కమ్మవారి కుటుంబాలతో పాటు అశ్వపురం, పినపాక మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కమ్మవారి కుటుంబాలు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కూచిపుడి నృత్యకారిణి కుమారి కాట్రగడ్డ హిమాన్సీ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, తాను నృత్య కళాకారిణిగా భారతీయ పురాతన దేవాలయాల అభివృద్ధి కోసం “ది టెంపుల్ డాన్స్”ను స్థాపించిన విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. హిమాన్సీ చౌదరిని కమ్మ మహాజన సేవా సంఘం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో మొగిలి గుణకర్ టీమ్ నిర్వహించిన హాస్యవల్లరి, చిన్నారుల నృత్యాలు, ఫన్నీ గేమ్స్ వంటి అంశాలు సందడిని సృష్టించాయి.

నూతన కమిటీ ఎన్నిక

కార్యక్రమం సందర్భంగా కమ్మ మహాజన సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికైన సభ్యులు:

  • అధ్యక్షుడు: ఉప్పలపాటి వెంకట రాంబాబు
  • ప్రధాన కార్యదర్శి: యలమాటి పూర్ణచందర్ రావు
  • కోశాధికారి: మేధరమెట్ల యాదగిరి
  • ప్రచార కార్యదర్శి: తోటకూరి సతీష్ కుమార్
  • ఉపాధ్యక్షులు: ఉడతని రవి, ధారపనేని హరి కృష్ణ
  • సహాయ కార్యదర్శులు: ఈరెల్లి అచ్చయ్య చౌదరి, మానుకొండ ఉమాకర్

కార్యక్రమం మొత్తం ఆధ్యంతం పండుగ వాతావరణంలో సాగింది. మహిళలు, పిల్లలు తమ ఆటపాటలతో సంతోషాన్ని పంచుకున్నారు. కార్యక్రమం ముగింపున నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించింది.కమ్మ మహాజన సంగం నిర్వహించిన ఈ వనభోజనాలు కనుల పండుగగా నిలిచాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *