పోలీసు విధులకు ఆటంకం కలిగించిన ఐదుగురు వ్యక్తుల అరెస్టు

మణుగూరు: మణుగూరు పట్టణంలో గత మూడు రోజుల క్రితం రాత్రి పోలీసు పెట్రోలింగ్ విధుల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పూల మార్కెట్ సెంటర్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న ఎస్ఐ రంజిత్, బ్లూ కాల్ట్  కానిస్టేబుల్ వీర, మరియు టిఎస్ఎస్పి సిబ్బందిపై ఐదుగురు వ్యక్తులు మద్యం మత్తులో దుర్భాషలాడి దాడి చేయడం జరిగింది. ప్రభుత్వ విధులను అడ్డుకోవడం మాత్రమే కాకుండా, పోలీసులపై దాడి చేసినందుకు సంబంధిత ఐదుగురు వ్యక్తులపై ఎస్ఐ రంజిత్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయబడింది. నిన్న రాత్రి వారిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు ఉత్తర్వుల మేరకు వారిని రిమాండ్‌కు పంపించారు.

అరెస్టయిన వ్యక్తుల వివరాలు:

  1. కొరివి చంద్రశేఖర్
  2. తక్యం గోపీచంద్
  3. ముక్కర సాయి కుమార్
  4. చిటికెన రామకృష్ణ
  5. నువ్వుల వంశీ

మణుగూరు ప్రజలకు పోలీసులు తెలియజేసేది ఏమిటంటే, పోలీసు లేదా ఇతర ప్రభుత్వ అధికారులపై దురుసుగా ప్రవర్తించడం, దాడి చేయడం వంటి చర్యలపై కఠినమైన శిక్షలు ఉంటాయి. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పోలీసు విభాగం రాత్రిపూట పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు నిర్వహిస్తోంది. గంజాయి, మాదక ద్రవ్యాల రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సమాజం భద్రతను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ప్రతి ఒక్కరూ పోలీసుల విధులకు సహకరించగలరని, సమాజం శాంతి భద్రతలను కాపాడేందుకు తోడ్పడగలరని పోలీసు శాఖ కోరుతోంది.

– C.I ఆఫ్ పోలీస్, మణుగూరు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *