“చదువుతోనే సమాజం మార్పు చెందుతుంది” అనే ఆలోచనకు శ్రీ విద్యాభ్యాస పాఠశాల ఒక ఉత్తమ నిదర్శనం.”
తేదీ:03/12/2024. మణుగూరు మండలం, సంతోష్ నగర్
మణుగూరు మండలంలోని శ్రీ విద్యాభ్యాస పాఠశాలలో విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పీకే ఓసి ప్రాజెక్టు అధికారి మరియు కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సిఎమ్ఓఏఐ) సింగరేణి శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన ప్రసంగంలో తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ, “చదువు మాత్రమే బ్రతుక్కి దారి చూపుతుంది” అని, విద్యార్థులు ఏకాగ్రతతో చదువుపై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకున్నా ప్రణాళికాబద్ధమైన కృషి అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే, అమెరికాలో నివసిస్తున్న తమ కుమార్తె కౌసల్య, అల్లుడు వినయ్ కుమార్ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్, కరుణ దంపతులు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు కేవలం తమ చదువులోనే కాకుండా సమాజ సేవకు స్ఫూర్తిగా ఉండాలని, మరింత ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని సాధన చేయాలని ఆయన సందేశమిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, స్థానిక ప్రజలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొని దాతృత్వానికి అభినందనలు తెలియజేశారు.

