మణుగూరులోని సింగరేణి పుత్రుడు డాక్టర్ కోట సునీల్ విజయగాథ

మణుగూరు, నవంబర్ 21:
మణుగూరు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ కోట సునీల్ గారు సింగరేణి వారసత్వాన్ని గర్వకారణంగా నిలిపిన మాణిక్యాలు. వారి తండ్రి శ్రీ కోట కాంతయ్య గారు నాలుగు దశాబ్దాల పాటు మణుగూరు ఓసి 2 ప్రాజెక్టులో సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్‌గా సేవలందించారు. తల్లిదండ్రులిద్దరూ విద్యావంతులు కావడంతో తమ సంతానాన్ని కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దారు.

డాక్టర్ సునీల్ గారు చిన్నతనమే నుంచి చదువు పట్ల ఆసక్తిని ప్రదర్శించి, తండ్రి ప్రోత్సాహంతో డాక్టరేట్ పొందారు. సింగరేణి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థిగా స్ఫూర్తిదాయక ప్రయాణం ప్రారంభించి, పుట్టిన ఊర్లోనే ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల సూపర్డెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సింగరేణి యువతకు ఆదర్శప్రాయుడిగా నిలిచిన డాక్టర్ సునీల్ గారు, తన సేవల ద్వారా మణుగూరు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సింగరేణి సామాజిక సేవా మాధుర్యాన్ని ప్రతిబింబిస్తూ, తమ కార్యచరణతో ఊరికి గర్వకారణంగా నిలుస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *