సింగరేణి అదుర్స్: ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుతమైన ఫలితాలు

సంస్థ స్థూల లాభం రూ. 1000 కోట్లకు పైగా పెరిగింది
కార్మికులకు దీపావళి బోనస్, అధిక లాభాల వాటా ప్రకటించిన ప్రభుత్వం
వారి పటిష్ట చర్యలతో అన్ని శాఖలను చురుకుగా నడిపిస్తున్న సింగరేణి సీఎండీ శ్రీ ఎన్. బలరామ్

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) ఆర్థిక సంవత్సరంలోని మొదటి అర్థభాగంలో 36 శాతం స్థూల లాభాల వృద్ధి సాధించి, కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. గడచిన ఏడాదితో పోలిస్తే రూ. 1072 కోట్ల అదనపు లాభాన్ని ఆర్జించింది. వర్షాల కారణంగా కొంతకాలం ఉత్పత్తి ప్రభావితమైనప్పటికీ, తక్షణ చర్యల ద్వారా ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపులో గణనీయమైన పురోగతి కనబడుతోంది.

ఆర్థిక క్రమశిక్షణతో పెరిగిన లాభాలు
సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు బొగ్గు అమ్మకాల ద్వారా రూ. 17,151 కోట్లు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ. 2,286 కోట్ల టర్నోవర్ సాధించింది. పన్ను చెల్లింపులకు ముందు సంస్థ స్థూల లాభం రూ. 4 వేల కోట్లకు చేరుకుంది, గత ఏడాది ఇదే కాలానికి ఉన్న లాభాల కంటే 36 శాతం అధికం.

కార్మికుల్లో కొత్త ఉత్సాహం
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం మరియు ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎ.రేవంత్ రెడ్డి దిశానిర్దేశంలో కార్మికులకు రూ. 796 కోట్ల లాభాల వాటా, రూ. 358 కోట్ల దీపావళి బోనస్‌ను అందించడం కార్మికుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

ఉత్పత్తి లక్ష్య సాధన దిశగా ముందుకు
సింగరేణి ఛైర్మన్ శ్రీ ఎన్. బలరామ్ అన్ని ఏరియాల పనితీరును సమీక్షించి, లక్ష్య సాధన దిశగా దిశానిర్దేశం చేస్తున్నారు. విపత్తు బీమా వంటి సంక్షేమ కార్యక్రమాలు కార్మికుల ధీమాను మరింతగా పెంచాయి. కొత్తగూడెం, ఇల్లందు వంటి ఏరియాల్లో అటవీ అనుమతుల లభ్యం సంస్థ భవిష్యత్తును మరింత భరోసా కలిగించాయి.

ఉత్సాహం నింపిన అవగాహన సదస్సులు
ప్రతిపాత్ర సమావేశాలు, ఉత్పాదకత పెంపు కార్యక్రమాలు నిర్వహించి, యంత్రాల వినియోగ సమయాన్ని గణనీయంగా పెంచిన సంస్థ, దాంతో రోజువారీ ఉత్పత్తిని 2.2 లక్షల టన్నులకు చేర్చగలిగింది.

భవిష్యత్తు లక్ష్యాలు
కార్మికుల అంకితభావంతో, సంస్థ 720 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తోంది. సింగరేణి మనుగడే తమ మనుగడ అని గుర్తించిన ఉద్యోగులు, ఉత్పత్తి ప్రక్రియలో మరింత చురుకుగా పాల్గొంటున్నారు.

సింగరేణి ఆదర్శ సంస్థగా నిలిచేలా, కార్మిక, నిర్వహణ, ప్రభుత్వ సహకారంతో సంస్థ ముందుకు దూసుకుపోతోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *