తెలంగాణలో అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్

బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ. శాంతికుమారి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రూప్-3 పరీక్షల నిర్వహణ, ధాన్యం మరియు పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, నర్సింగ్, పారామెడికల్ కాలేజీల ఏర్పాటులపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఈ సమావేశంలో ఐడీఓసీ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ పాల్గొన్నారు. అలాగే, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సిపిఓ సంజీవరావు, జిల్లావ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పౌర సరఫరాల శాఖ అధికారులు రుక్మిణి, త్రినాధ్ బాబు మరియు ఇతర సంబంధిత అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *